నూతన సాగు పద్ధతులకు వేదికగా రైతు మహోత్సవం

నూతన సాగు పద్ధతులకు వేదికగా రైతు మహోత్సవం

  • 150కు పైగా ప్రదర్శన స్టాళ్ల ఏర్పాటు
  • ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక అవగాహన
  • శాస్త్రవేత్తలతో రైతులకు నేరుగా చర్చించే అవకాశం
  • నర్మెట్టకు స్టేషన్ ఘన్ పూర్ నుంచి తరలివెల్లిన రైతులు

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నిర్వహిస్తున్న రైతు మహోత్సవానికి స్టేషన్ ఘన్‌పూర్ మండలం నుంచి రైతులు ఉత్సా హంగా తరలివెళ్లారు. శుక్రవారం స్టేషన్ ఘన్ పూర్ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సు ద్వారా రైతులను కార్యక్రమ స్థలానికి తరలివెళ్లారు.

ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి చంద్రన్‌కుమార్ మాట్లాడా రు. ఈ మహోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు చేతుల మీదుగా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ పూజ ఘనంగా నిర్వహించబడనుందన్నారు.

రైతుల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహి స్తోందన్నారు. మహోత్సవంలో భాగంగా సుమారు 150 ప్రదర్శన స్టాళ్లు ఏర్పాటు చేయబడి, వివిధ పంటల సాగు పద్ధతులు, ఆధునిక వ్యవ సాయ సాంకేతికతలు, కొత్త ఆవిష్కరణలను రైతులకు పరిచయం చేస్తున్నారని పేర్కొన్నారు.

శాస్త్రవేత్తలతో నేరుగా చర్చించే గోష్టి కూడా ఏర్పాటు చేయబడటంతో రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకు నే అవకాశం కల్పించబడిందన్నారు. అలాగే ఆయిల్ పామ్ సాగు, దాని లాభదాయకత, మార్కెటింగ్ అవకాశాలు వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించబడుతోందన్నారు.

మొత్తంగా ఈ రైతు మహోత్స వం ద్వారా రైతుల్లో నూతన సాగు పద్ధతులపై అవగాహన పెంపొందిం చడంతో పాటు, ఆధునిక సాంకేతికతలను అనుసరించి అధిక దిగుబ డులు సాధించేందుకు మార్గనిర్దేశం చేయడం ప్రధాన లక్ష్యమని ఏవో పేర్కొన్నారు.