సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించాలి..

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని భూసి మెట్ట గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మించే సిసి రోడ్డు నిర్మాణ పనులకు గురువారం భూసిమెట్ట సర్పంచ్ ఆత్రం సింధు నగేష్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. పనులను పరిశీలించి ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సిసి రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని నాణ్యత లోపించకుండా చూడాలని ఆమె కాంట్రాక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువ నాయకులు కేంద్రే విశాల్,వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply