ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం పై వైసీపీ నేతలు ఆరా.
కుటుంబ సభ్యులను కలిసిన నేతలు.
నర్సాపురం, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి , వైస్సార్సీపీ పి ఏ సి సభ్యులు, సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం పై వైసీపీ నేతలు ఆరా తీశారు. హైదరాబాద్ లోని సింధు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పద్మనాభంను శనివారం వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు , ఎమ్మెల్సీ కవురు శ్రీను లు కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడ అందుతున్న ఆరోగ్య సేవలు గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పద్మనాభం కుమారుడు, ప్రత్తిపాడు నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జి ముద్రగడ గిరి ను పరామర్శించి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం కుదుట పడాలని, త్వరగా కోలుకొని సాధారణ జీవితం గడపాలని ఆశిస్తున్నామని దైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు.
