వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం ముగింపు..
మరిపెడ, ఆంధ్రప్రభ : మరిపెడమండలంలోనిపురుషోత్తమాయగూడెం రైతు వేదికలో నిర్వహించిన వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది.ఈసందర్భంగా నిర్వహించిన ముగింపుకార్యక్రమంలో ఎంపీడీవో వార్డు సభ్యులకు శిక్షణ పూర్తి చేసినందుకుసర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణ తీసుకున్న వార్డు సభ్యులకు ఎంపీడీవో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధికార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంతో పాటు గ్రామ సమస్యల పరిష్కారంలో వార్డు సభ్యులుసమన్వయంతో పనిచేయాలని సూచించారు.శిక్షణ ద్వారా స్థానిక పాలన, గ్రామాభివృద్ధి,పారిశుధ్యం, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై సభ్యులకుఅవగాహన కల్పించినట్లుతెలిపారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది,వార్డు సభ్యులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
