రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

ఉట్నూర్ రూరల్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఏంద సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు.
108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్ మండలం తోయగూడ గ్రామానికి చెందిన పెందూర్ లక్ష్మణ్ (52), సక్కుబాయి దంపతులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రురాలు సక్కుబాయిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కొద్ది సేపటికే ఆమె కూడా మృతి చెందినట్లు 108 ఈఎంటీ గణేష్, పైలట్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
