Vijay | సింగిల్ గా వస్తా..

Vijay | సింగిల్ గా వస్తా..
ఒంటరి పోరుకు సిద్ధమైన టీవీకే
ఏ కూటమిలో చేరడంలేదని స్పష్టంచేసిన టీవీకే
234 స్థానాల్లో టీవీకే అభ్యర్థుల పోటీ
NDA 90 సీట్లు, 2.5 ఏళ్లు సీఎం ఆఫర్ ను తిరస్కరించిన టీవీకే
Vijay | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీవీకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ స్పష్టం చేసింది. ఏ కూటమిలోనూ చేరబోమని ప్రకటించింది. తమిళనాడులో టీవీకే మొత్తం 234 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దింపనున్నట్లు వెల్లడించింది.
ఇక ఎన్డీఏ నుంచి వచ్చిన 90 సీట్లు, రెండున్నరేళ్ల సీఎం పదవి ఆఫర్ను కూడా టీవీకే తిరస్కరించింది. ఢిల్లీ ముందు విజయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచరని టీవీకే జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున స్పష్టం చేశారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఒంటరి పోరుకు సిద్ధమైన టీవీకే ఎన్నికల్లో విజయం సాధిస్తుందా..అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
