Cauvery Dispute | మేకెదాటు ప్రాజెక్టుకు తమిళనాడు అసెంబ్లీ నో
Cauvery Dispute | మేకెదాటు ప్రాజెక్టుకు తమిళనాడు అసెంబ్లీ నో
కావేరీ జలాలపై ఏకగ్రీవ తీర్మానం
కేంద్రం అనుమతులు ఇవ్వొద్దని సీఎం విజయ్ డిమాండ్
Cauvery Dispute | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మేకెదాటు డ్యామ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ గురువారం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. సీఎం జోసెఫ్ విజయ్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.
కర్ణాటక ప్రభుత్వం సుమారు రూ.9,000 కోట్ల వ్యయంతో చేపట్టాలనుకుంటున్న మేకెదాటు జలాశయ ప్రాజెక్టు ఏకపక్ష చర్యగా ఉందని తమిళనాడు ప్రభుత్వం అభిప్రాయపడింది. కావేరీ బేసిన్ ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటోందని, అందుబాటులో ఉన్న నీరు రాష్ట్రాల మధ్య ఇప్పటికే పంపిణీ అయిపోయిందని సీఎం విజయ్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టులకు లేదా అదనపు నీటి వినియోగానికి అవకాశం లేదని స్పష్టం చేశారు.
మేకెదాటు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాంకేతిక, పర్యావరణ అనుమతులు ఇవ్వకూడదని, కేంద్ర జల సంఘం కూడా ప్రాజెక్టు వివరాల నివేదికను పరిశీలించరాదని అసెంబ్లీ తీర్మానం ద్వారా కోరింది.
నీరు ప్రజల ప్రాథమిక హక్కు అని, రైతుల ప్రయోజనాలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని సీఎం విజయ్ పేర్కొన్నారు. రాజకీయ భేదాలు పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అందరూ ఏకతాటిపై నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు సైతం తీర్మానానికి మద్దతు తెలపడంతో అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.
