BJP | సీఎంకు రామచందర్‌రావు లేఖ
BJP | సీఎంకు రామచందర్‌రావు లేఖ
BJP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసాను రూ.15 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.. ఆ హామీ ఏమైందని రామచందర్‌రావు ప్రశ్నించారు. రైతు భరోసాను పెంచకుండా.. రూ.12 వేలకే పరిమితం చేశారన్నారు.
ఆ రైతు భరోసాను కూడా సమయానికి ఇవ్వడం లేదన్నారు. యాసంగి పంట రైతు భరోసా రాక రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. ప్రాజెక్టుల నీళ్లు కాల్వలకు రాక పంటలు ఎండిపోతున్నాయన్నారు. అప్పులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రైతు భరోసాను పెంచాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు.
