Short circuit | ఏడుగురు సజీవ దహనం
Short circuit | ఏడుగురు సజీవ దహనం
Short circuit | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మధ్య ప్రదేశ్ ఇండోర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బృజేశ్వరి అనెక్స్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఎలక్ట్రిక్ కారుకు ఛార్జింగ్ పెట్టిన సమయంలో షార్ట్ సర్క్యూట్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్న సిలిండర్లు పేలి క్షణాల్లోనే ఆ మంటలకు భవనం మొత్తం ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో ఒకే ఇంటికి చెందిన ఏడుగురు సజీవ దహనం అయ్యారు.
ఈ భవనం యజమాని మనోజ్ పుగాలియా పాలిమర్ వ్యాపారి కావడంతో ఇంట్లో పాలిమర్ మెటీరియల్ నిల్వ చేశారని, దాని వల్ల మంటలు వేగంగా వ్యాపించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్ వర్గీయ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్‌కు సంబంధించి నిపుణుల కమిటీతో విచారణ జరిపి, కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
