NBK111 క్రేజీ అప్‌డేట్..

NBK111 క్రేజీ అప్‌డేట్..

  • ఈసారి ‘న్యూ ఏజ్’ మాస్ జాతరే!

గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహా రెడ్డి’ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సక్సెస్‌ఫుల్ కాంబో మరోసారి సరికొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

‘వృద్ధి సినిమాస్’ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా #NBK111 అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఒక భారీ సర్ప్రైజ్ అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఈ పోస్టర్‌పై ఉన్న “నో మోర్ వింటేజ్.. ఓన్లీ న్యూ ఏజ్” (No More Vintage, Only New Age) అనే ట్యాగ్‌లైన్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చింది.

ఈసారి బాలయ్యను గతంలో ఎన్నడూ చూడని ఒక సరికొత్త గెటప్‌లో, సరికొత్త పంథాలో గోపీచంద్ మలినేని చూపించబోతున్నట్లు దీని ద్వారా స్పష్టమవుతోంది. జూన్ 10 డేట్‌తో పాటు పోస్టర్‌లో ఉన్న బుల్లెట్స్ (Bullet Imagery) చూస్తుంటే ఆరోజు ఒక విధ్వంసం సృష్టించే అప్‌డేట్ రాబోతోందని అర్థమవుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్ర యూనిట్ అక్కడ చిత్రీకరిస్తోంది. ఈ సినిమాలో నటుడు మనోజ్ మంచు విలన్‌గా నటిస్తుండటం విశేషం. బాలకృష్ణను ఢీకొట్టే ఒక పవర్‌ఫుల్, ఇంపాక్ట్‌ఫుల్ నెగెటివ్ క్యారెక్టర్‌లో మనోజ్ కనిపించబోతున్నట్లు టాక్. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Leave a Reply