కొత్తగా డీసీసీ అధ్యక్షుల నియామకం..

కొత్తగా డీసీసీ అధ్యక్షుల నియామకం..

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : మహారాష్ట్రలోని అన్ని జిల్లాలో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కొత్తగా డీసీసీ అధ్యక్షుల నియామకం కొనసాగనుంది.ఇందులో భాగంగా మహారాష్ట్ర పరిశీలకులుగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు చోటు లభించింది.ఈసందర్భంగా ఆల్ఇండియా కాంగ్రెస్ కమిటీ నియామక పత్రాన్ని జారీ చేసింది.తమపై నమ్మకంతో పెద్ద బాధ్యతను అప్పగిస్తూ మహారాష్ట్ర డిసిసి అధ్యక్ష నియామకానికి పరిశీలకులుగా తమ పేరును ఖరారు చేయడంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు.తమకు ఆప్పగించిన బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు.

Leave a Reply