ఉగాది పురస్కారం…

ఉగాది పురస్కారం…
పామర్రు – ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారంకు కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన ఆంధ్రభూమి పాత్రికేయుడు పి. ఎం. ఎస్. ప్రసాద్ జర్నలిజం &సోషల్ వర్క్ విభాగం నుంచి ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ 17-3-2026 ఉత్తర్వులు జారిచేసారు, ఈ మేరకు ఉగాది రోజున విజయవాడలో ప్రభుత్వం నిర్వహించే ఉగాది వేడుక ల్లో రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్య మంత్రి కె. పవన్ కళ్యాణ్ గారి చేతులు మీదుగా సన్మానం పొంది జ్ఞాపిక, ధ్రువ పత్రం, రూ.10వేలు నగదు అందుకోనున్నారు.
గతంలో అనేక అవార్డులు అందుకున్న ప్రసాద్ కు ఈ అవార్డు కిరీటంగా నిలుస్తుందని పామర్రులోని మానవత సేవ సంస్థ,కళా పరిషత్, లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్, కృష్ణా జిల్లా ప్రెస్ క్లబ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, వి. హె చ్. పి. ప్రతినిధులు, పలు రాజకీయ పక్ష నేతలు కొనియాడుతూ అభినందనలు తెలిపారు.
