ముందస్తు జిపి కార్మికుల అరెస్టు

ముందస్తు జిపి కార్మికుల అరెస్టు

కడెం, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హైదరాబాద్ ధర్నా కార్యక్రమానికి వెళ్లకుండా కడెం మండల పంచాయతీ కార్మిక సంఘం నాయకులను ఈ రోజు ఉదయం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా అరెస్టైన‌ కార్మికులు మాట్లాడుతూ… కార్మికులను అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని కార్మికుల పెండింగ్ జీతాలు, మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, కార్మికులకు ఇన్సూరెన్స్, పీఎఫ్, ఈ ఎస్ ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయినా కార్మికులు గొర్రె నరేష్, శెనిగరపు రాజన్న, ఎస్ మొగిలి, నల్వల పోషన్న, లవుడ్య గోవింద్, నల్వల రవి, ఎన్ గంగాధర్ లు ఉన్నారు.

Leave a Reply