97 రోజుల్లో ఆలయ హుండీ ఆదాయం రూ.9.47 లక్షలు
దండేపల్లి, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం హుండీలను బుధవారం జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ నవీన్, ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో లెక్కించారు.
మార్చి 26, 2026 నుంచి జూన్ 30, 2026 వరకు 97 రోజుల వ్యవధికి సంబంధించిన హుండీలను తెరిచి లెక్కించగా మొత్తం రూ.9,47,055 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ సూపరింటెండెంట్ బి. శ్రీనివాస్, వేదపండితులు డి. నారాయణ శర్మ, అర్చకులు జి. సంపత్ స్వామి, వి. రామకృష్ణ స్వామి, పోలీసు సిబ్బంది, ఆలయ సిబ్బంది, సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు
