భీమ్‌గల్‌లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
భీమ్‌గల్‌లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ నాయకులు
భీమ్‌గల్ టౌన్/రూరల్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భీమ్‌గల్ పట్టణంలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పర్స అనంతరావు ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పర్స అనంతరావు, మల్లెల లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. అమరవీరుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయని వారు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, సొసైటీ డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, పార్టీ పట్టణ, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
