కార్మిక రైతు చట్టాలను ప్రభుత్వాలు కాల రాస్తున్నాయి

  • సీఐటీయూ

చిట్యాల,ఆంధ్రప్రభ: పోరాడి సాధించుకున్న కార్మిక, రైతు చట్టాలను, హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. చిట్యాల మండలం నేరడ, ఉరుమడ్ల గ్రామాలలో బుధవారం నాడు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు, జిట్ట నగేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

చిట్యాల మండలం నేరడ, ఉరుమడ్ల గ్రామాలలో బుధవారం నాడు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు, సీఐటీయూల ఆధ్వర్యంలో నల్ల బ్యానర్ లు,జెండాలతో నిరసన ప్రదర్శనలు చేసి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను,విబిజీ రాం జీ పేరు మార్చి, బడ్జెట్ కెటాయింపులు భారీగా తగ్గించిందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో కత్తుల లింగస్వామి, అవిశెట్టి శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.