గుండేరులో పడి యువకుడు మృతి..

గుండేరులో పడి యువకుడు మృతి..

ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల మండల పరిధిలోని దేవరకోట గ్రామం వద్ద ఉన్న గుండేరు కాలువలో పడి యువకుడు మృతి చెందిన విషాద సంఘటన జరిగింది. చల్లపల్లి మండల పరిధిలోని పుచ్చగడ్డ గ్రామానికి చెందిన గొరిపర్తి రాము సోమవారం గుండేరులో పడి మృతి చెందగా, మంగళవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

స్థానికుల సాయంతో మృతదేహాన్ని వంతెన పైకి తీసుకురాగా, ఘంటసాల ఎస్ఐ వేమన చందన సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతుడు అవివాహితుడు. టీవీ మెకానిక్ గా పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. రాము మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.