వేంకటేశ్వర ఆలయంలో చోరీ..

వేంకటేశ్వర ఆలయంలో చోరీ..

ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్ర ప్రభ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ ఎండీకాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. స్వామివారి కిరీటం, అమ్మవారి నగలు, ఇతర ఆభరణాలు కనిపించకపోవడంతో ఆలయ కమిటీకి, పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు ఆభరణాల విలువ రూ. 10 లక్షల పైనే ఉంటుందని పండితులు తెలిపారు. ఆలయ దర్వాజా వద్ద గునపం, వాటర్ బాటిల్ పెట్టుకొని తీరిగ్గా దొంగతనం చేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఎల్ఎండి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఫింగర్ ప్రింట్, క్లూస్ టీం విభాగాలకు సమాచారం అందించారు.