అది.. పూర్వజన్మ సుకృతం – టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడు

అది.. పూర్వజన్మ సుకృతం – టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడు

తిరుమల, ఆంధ్రప్రభ : శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ అని.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశికి ఆలయ శుద్ధి చేస్తామన్నారు. ఆలయంలో మూలమూర్తికి వస్త్రం కప్పి ఉప ఆలయాలను శుద్ధి చేశాం.

శుద్ధి అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నివేదనలు సమర్పిస్తాం. శుద్ధి కార్యక్రమం తర్వాత వైకుంఠ క్యూ కాంప్లెక్సులో ఉన్న భక్తులను దర్శనానికి అనుమతిస్తామని.. ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం అని టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడు తెలియచేశారు. ఉగాది ఆస్థానం సందర్భంగా శుద్ధి కార్యక్రమంలో బోర్డు సభ్యులు పాల్గొన్నారు.