అంగన్ వాడి కేంద్రంలో.. సర్పంచ్

అంగన్ వాడి కేంద్రంలో.. సర్పంచ్
ములకలపల్లి, ఆంధ్రప్రభ : ములకలపల్లి మండలం జగన్నాధపురం పంచాయతీ నెల్లివారిగూడెం గ్రామంలో అంగన్ వాడి టీచర్ కొమరం రాజేశ్వరి ఆదేశాల మేరకు సర్పంచ్ కుంజా వినోద్ ఫీడింగ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. ప్రతి నెల క్రమం తప్పకుండా పంపిణీ చేయాలి అన్నారు. అనంతరం ఇటీవల ఖమ్మం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న, రేగులకుంట గ్రామానికి చెందిన కోర్స రామును పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఆరోగ్యం పరంగా ఏ విషయమైనా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దృష్టికి తీసుకెళ్లాతానని భరోసా ఇస్తూ వారితో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎస్ కె ఇబ్రహీం, గ్రామ కమిటీ అధ్యక్షులు పామర్తి కృష్ణ, వార్డు సభ్యులు బైట వెంకటలక్ష్మి, సున్నం మంగ, పిడియాల వెంకటేశ్వర్లు, కటారపు వెంకట్రావు, కురం రామకృష్ణ, సున్నం నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
