మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..

మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..
జిల్లా కలెక్టర్‌కు ఎంపీ అర్వింద్ ధర్మపురి లేఖ
నిజామాబాద్ క్రైమ్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించిన మక్క పంటకు సంబం ధించి వెంటనే కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిజామాబా ద్ జిల్లా కలెక్టర్‌కు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి లేఖ రాశారు. ఈ సంద ర్భం గా సోమవారం ఒక ప్రకటనలో వెల్లడిం చారు. జిల్లాలో ఈ సంవత్సరం పెద్ద ఎత్తు న మక్క పంట పండిం దని, అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరుగుతోం దని ఆయన పేర్కొ న్నారు. కేంద్ర ప్రభుత్వం మక్కకు కనీస మద్దతు ధర రూ.2400 ప్రకటిం చినప్పటికీ, కొనుగోలు కేంద్రాలు లేకపోవడం తో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు క్వింటా ల్‌కు రూ.1700 నుంచి రూ.1800 వరకు తక్కు వ ధరకు అమ్ముకో వాల్సిన పరిస్థితి ఏర్ప డిందన్నారు.

ఈ సంద ర్భంగా ప్రతి రైతు సగ టున రూ.20,000 నుం డి రూ.25,000 వరకు నష్టపోతు న్నారని ఎం పీ తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి మక్కను మద్దతు ధరకు కొను గోలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఎంపీ కోరారు. అలాగే రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమై న అన్ని ఏర్పాట్లు చేసి, మక్క కొనుగోలు ప్రక్రి యను త్వరితగతిన ప్రారంభించాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి సూచించారు.
