Great Honor | త్యాగరాయ గానసభలో ఘనంగా సత్కారం..

Great Honor | త్యాగరాయ గానసభలో ఘనంగా సత్కారం..

Great Honor | ఉగాది పురస్కారాలకు శంకర నారాయణ, నీలా విజయబాబు ఎంపిక
పురస్కారాలు ప్రదానం చేసిన మధుసూదనాచారి
త్యాగరాయ గానసభలో ఘనంగా కార్యక్రమం
పాత్రికేయుడిగా, హాస్యబ్రహ్మగా శంకర నారాయణ సేవలు
ఆధ్యాత్మిక వేత్తగా, దాతగా నీలా విజయబాబు సేవలు
త్యాగరాయ గానసభ తనకు దేవాలయం లాంటిదని శంకర నారాయణ వ్యాఖ్య
కార్యక్రమంలో పాల్గొన్న త్యాగరాయ గానసభ కార్యవర్గ సభ్యులు

Great Honor | త్యాగరాయ గానసభ : పాత్రికేయుడిగా,, హాస్యబ్రహ్మగా శంకర నారాయణ సుప్రసిద్ధులని, ఆదర్శ ప్రాయులని, అలాగే ఆధ్యాత్మిక వేత్తగా, దాతగా నీలా విజయ బాబు సుపరిచితులని, వారు ఉగాది పురస్కారాలకు అర్హులని విధానమండలి ప్రతిపక్షనాయకుడు సిరికొండ మధుసూదనాచారి ప్రశంసించారు.

శంకర నారాయణకు, నీలా విజయబాబులకు త్యాగరాయ గాన సభ తెలంగాణ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు కళా వేదికలో పరాభవ సంవత్సర ఉగాది పురస్కారాలను మధు సూదనాచారి ప్రదానం చేశారు.

త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. త్యాగరాయ గాన సభ కళాకారుడిగా తనకు పునర్జన్మ నిచ్చిందని, ఇది తనకు దేవాలయం లాంటిదని శంకర నారాయణ అన్నారు. త్యాగరాయ గాన సభ కార్యవర్గ సభ్యుడు బండి శ్రీనివాస్ పురస్కార గ్రహీతలను అభినందించగా, త్యాగరాయ గాన సభ సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి చక్రపాణి వందన సమర్పణ చేశారు.

click here to read

click here to read more

Leave a Reply