అనాధ పిల్లలకు అభిమన్యు గ్రూప్ ఆత్మీయ సహాయం

అనాధ పిల్లలకు అభిమన్యు గ్రూప్ ఆత్మీయ సహాయం

రూ. 90,500 సహాయం చేసి మానవత్వం చాటుకున్న అభిమన్యు గ్రూప్

ఉట్నూర్,ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో ఇటీవల తల్లిదండ్రులు మృతి చెందడంతో అనాదలైన పిల్లలకు అభిమన్యు గ్రూప్ అండగా నిలిచింది.. ఉట్నూర్ మండలంలోని రాంజీ గోండ్ నగర్ గ్రామానికి చెందిన ఆత్రం గంగు బాయి ఎనిమిది రోజుల పసికందు ను జన్మనిచ్చి అకాల మృతిచెందింది. తండ్రి విట్టల్ కూడ గత నాలుగు నెలల క్రితం మృతి చెందారు.

దీనితో మూడు సంవత్సరాల కొడుకు,8 రోజుల పసిగుడ్డు అనాధలయ్యారు. దీనితో అభిమన్యు గ్రూప్ ద్వారా అనాదలను ఆదుకోండిఅనే పిలుపు దాతలు ముందుకు వచ్చారు.. దాతలు రూ, 90,500 జమ అవ్వగా గ్రూప్ సభ్యులు మెస్రం శేకర్ ఆధ్వర్యంలో ఆదివారం రాంజీ గోండ్ నగర్ వెళ్లి చిన్నారులకు అందచేశారు.నానమ్మ… పసి కందు పేరిట ఫిక్స్ డిపాసిట్ చేయాలనీ సూచించారు.. ఇలా సహాయం చేసిన అభిమన్యు గ్రూప్ నీ ప్రతి ఒక్కరూ అభినందనలు తెలియ చేశారు.

ఈ కార్యక్రమం లలక్కారం మాజీ సర్పంచ్ మర్సు కొల తిరుపతి, సరస్వతి, మెస్రం లింగు సార్, కుంర రమణి, మడవి నాగుబాయి, అర్కా ఇందిరా, మడవి రత్న, ఆత్రం రంభ,బండి విజయ్, సలాం దేవ్ రావు, మెస్రం దేవ్ రావ్, ఆత్రం తిరుపతి, మర్సు కొల సురేందర్,మర్సుకొల సరస్వతీ. నైతం వందన, మెస్రం శివ, జాదవ్ రంజిత్, మెస్రం జగన్,మెస్రం బాదు, మెస్రం కృష్ణ, తొడసం నాగోరావ్,మడవి రూపీదేవ్, పూసం నాందేవ్, పెందూర్ సంతోస్,మెస్రం మాణిక్ రావ్, తదితరులు పాల్గొన్నారు.