అంబేద్కర్ ఆలోచన స్పూర్తితో ముందుకు సాగాలి

అంబేద్కర్ ఆలోచన స్పూర్తితో ముందుకు సాగాలి

  • టీజీ ఎన్ పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు ఆనంద్

హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; అంబేద్కర్ ఆలోచన విధానం స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగుతూ అసోసియేషన్ ను బలోపేతం చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు ఎ ఆనంద్ కోరారు.హన్మకొండ జిల్లా ఎస్సీ,ఎస్టీ ఎలక్ట్రిసిటీ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశం హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆనంద్ తో పాటు కంపెనీ జనరల్ ప్రధాన కార్యదర్శి ఎన్ కుమారస్వామిలు 2026 డైరీని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రమోషన్లలో మెరిట్ సీనియారిటీ ని రద్దు చేసి,రోస్టర్ సీనియారిటీని పెట్టడానికి అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అన్యాయాన్ని ఎదురించి ప్రశ్నించడం నేర్చుకోవాలని తెలిపారు.

అలాగే విద్యుత్ సంస్థలో అందరకి కంటే ఎస్సీఎస్టీ ఉద్యోగులు ఎక్కువగా పనిచేసి సంస్థను అభివృధి పథంలో ముందుంచాలని కోరారు … కాన్షీరామ్ గారి జయంతి సందర్భంగా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చొక్కారావు,శిరీష్ కుమార్ కంపెనీ ఉపాధ్యక్షులు, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు,సభ్యులు పాల్గొన్నారు…