రామాలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; హనుమాన్ జయంతి పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ 34 వ డివిజన్ శివనగర్ రామాలయంలో విశేష పూజలు అభిషేకాలు అర్చనలు వేద బ్రాహ్మణుల మంత్రోత్సవాల మధ్య నిర్వహించారు. మంగళవారం ఉదయం 5 గంటల నుండి అభిషేకాలు నిర్వహించారు. హనుమాన్ దీక్ష పరులు హనుమాన్ అభిషేకంలో పాల్గొన్నారు.

శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో పంచముఖ ఆంజనేయుడు కి భక్తులు ఉదయం 6 గంటల నుండి దర్శనం చేసుకుని స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. వందలాది మంది భక్తులు హనుమాన్ చాలీసా సామూహికంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.

కార్యక్రమంలో శ్రీ సీతారామచంద్రస్వామి ట్రస్ట్ అధ్యక్షుడు వడ్నాల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మంచాల కృష్ణమూర్తి, ఏకవీర అధ్యక్షుడు వడ్నాల సదానందం,బుదారపు భాస్కర్, శ్రీరాం రాజేష్, ఆడెపు సాంబమూర్తి, బత్తుల నవీన్, కృష్ణమూర్తి, పద్మాలయ పరపతి సంఘం కార్యనిర్వాకులు, ఏకవీర సంఘం ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు.