యువ నాయకుడికి కీలక బాధ్యతలు

కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మున్సిపాలిటీ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎండీ రియాజ్ ఖాన్‌ను నియమించినట్లు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు సోమవారం మహబూబాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్, జిల్లా ఇన్‌చార్జి భూక్య వెంకటేష్‌లు నియామక పత్రాన్ని ఎండీ రియాజ్ ఖాన్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా ఎండీ రియాజ్ ఖాన్ మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ, డీసీసీ మాజీ అధ్యక్షుడు జె. భరత్ చందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్, జిల్లా ఇన్‌చార్జి భూక్య వెంకటేష్‌తో పాటు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

కేసముద్రం మున్సిపల్ పరిధిలో యూత్ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసి, యువతను పార్టీ వైపు ఆకర్షించేలా కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను యూత్ కాంగ్రెస్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి పనిచేస్తానని పేర్కొన్నారు.

Leave a Reply