ఉత్తమ సేవలందిస్తున్న కార్మికులకు సన్మానం

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జై నూర్ మేజర్ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు పారిశుద్ధ్య నిర్మూలన లో ఉత్తమ సేవలందించడంతో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆదివారం మేజర్ గ్రామపంచాయతీ ఆవరణలో పంచాయతీ కార్మికులకు సర్పంచ్ కొడప ప్రకాష్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానం చేశారు.

పంచాయతీ కార్మికులు పారిశుద్ధ్య నిర్మాణంలో చేస్తున్న కృషి ని అభినందించారు. ఈ సన్మాన కార్యక్రమంలో జై నూర్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ డోంగ్రే ప్రకాష్, ఇన్చార్జి ఈఓ ఆనందరావు, జై నూర్ వైద్యాధికారి నాగర్ గోంజ్ అశోక్, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ గులాబ్ సింగ్, వార్డ్ మెంబర్ షేక్ రహీం, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.