మాటల యుద్ధం.. ట్రంప్ ను ఎగతాళి చేసిన ఇరాన్

మాటల యుద్ధం.. ట్రంప్ ను ఎగతాళి చేసిన ఇరాన్

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మిడిల్ ఈస్ట్ లో యుద్ధంతో పాటు ఇరాన్, అమెరికాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ చివరకు పరాయి దేశాలను అడుక్కుంటున్నారని ఇరాన్ మంత్రి ఎగతాళి చేశారు. కాగా హర్మూజ్ జలసంధిని సురక్షితంగా ఉంచేందుకు జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలు తమ యుద్ధనౌకలను పంపాలని ట్రంప్ చేసిన విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యం అని చెప్పుకునే అమెరికా.. ఇప్పుడు తన నౌకల రక్షణ కోసం ఇతర దేశాల ముందు యాచిస్తోందన్నారు. చివరకు చైనాను కూడా బతిమాలుకునే స్థాయికి ట్రంప్ దిగజారారు’’ అని ఇరాన్ అధికారులు ఎగతాళి చేశారు.

హర్మూజ్ జలసంధి కేవలం తమ నియంత్రణలోనే ఉంటుందని, మిగతా దేశాల నౌకలు ఇక్కడ వచ్చి రక్షణ కల్పించడం ఆసాధ్యమని ఇరాన్ హెచ్చరించింది. కాగా హర్మూజ్ జలసంధి మూతపడటంతో అంతర్జాతీయంగా చమురు రవాణా అస్తవ్యస్తమైంది.