Iftar dinner | ప్రభుత్వ ఇఫ్తార్ విందును విజయవంతం చేయాలి

Iftar dinner | ప్రభుత్వ ఇఫ్తార్ విందును విజయవంతం చేయాలి

ఎంపీ కేశినేని శివనాద్
ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సమీక్ష
హాజరైన ముస్లిం మైనారిటీ నాయకులు, పెద్దలు, అధికారులు

Iftar dinner | విజయవాడ, ఆంధ్రప్రభ : రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా 16వ తేదీన సోమవారం సాయంత్రం విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్న ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని ) పిలుపునిచ్చారు. గురు నానక్ కాలనీలోని పార్లమెంటు నియోజకవర్గం కార్యాలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై ముస్లిం మైనారిటీ పెద్దలు, నాయకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేనివిధంగా రంజాన్ మాసంలో ముస్లిం సోదరులను, ముస్లిం కుటుంబాల వారిని గౌరవిస్తూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇఫ్తార్ విందును ప్రభుత్వపరంగా ఇస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లిం మైనారిటీల పక్షపాతి అని, ముస్లిం మైనారిటీల సంక్షేమాన్ని కాంక్షిస్తారన్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ప్రతి ఏటా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతుందన్నారు.

Iftar dinner |

ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వపరంగా జరగనున్న ఇఫ్తార్ విందుకు వేలాదిమంది ముస్లిం సోదరులు ఇఫ్తార్, నమాజ్, డిన్నర్ కార్యక్రమాలకు హాజరవుతారని ఈ కార్యక్రమాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రితో పాటు గా ప్రభుత్వ పెద్దలు అనేకమంది పాల్గొనే ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు ముస్లిం మైనారిటీ సోదరులంతా కృషి చేయాలన్నారు. ప్రధానంగా రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేసే ప్రతి ముస్లిం సోదరులకు, ముస్లిం మత పెద్దలకు ప్రభుత్వ ఇఫ్తార్ విందు ఆహ్వానం తప్పనిసరిగా అందేలా చూడాలన్నారు.

Iftar dinner |

ఇఫ్తార్ విందుకు పటిష్టంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, ప్రతి ముస్లిం సోదరుడు సాయంత్రం ఐదు గంటలకు ఇఫ్తార్ విందు జరిగే ప్రాంగణానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కె.నాగుల్ మీరా మాట్లాడుతూ… ఇఫ్తార్ విందు కార్యక్రమం విజయవంతానికి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ముస్లిం మైనారిటీ మత పెద్దలతో పాటుగా టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతాఉల్లా, ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహణ పరిశీలకులు పి వెంకటేష్ , మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎస్ కే కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

CLICK HERE TO READ MORE : Gas Agency | ఇంద్రకీలాద్రికి గ్యాస్ కొరత లేదు…

CLICK HERE TO READ MORE :

Leave a Reply