ఘనంగా కాన్సీరాం జయంతి వేడుకలు..

ఘనంగా కాన్సీరాం జయంతి వేడుకలు..
చిట్యాల, ఆంధ్ర ప్రభ : మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు జన్నే యుగేందర్ ఆధ్వర్యంలో ఆదివారం మాన్యశ్రీ కాన్సిరాం 92వ జయంతి వేడుకలు , ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య పాల్గొని మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం అందించుటకు అహర్నిశలు కృషి చేసి, తన జీవితాన్ని అర్పించిన త్యాగశీలి కాన్సీరామ్ కొనియాడారు . ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల మాజీ అధ్యక్షులు సరిగొమ్ముల రాజేందర్, ధర్మ సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు పుల్ల అశోక్, అంబేద్కర్ సంఘంనాయకులు గురుకుంట్ల కిరణ్ పాముకుంట్ల చందర్, పుల్ల రాయ నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
