యుద్దంపై బ్రిక్స్ దేశాలు అసంతృప్తి…

యుద్దంపై బ్రిక్స్ దేశాలు అసంతృప్తి…

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రిక్స్ సభ్య దేశాలు అసంతృప్తి నెలకొంది. యుద్దంపై ఒక నిర్ణయానికి బ్రిక్స్ దేశాలు రావడం సవాలుగా మారిందని భారత్ పేర్కొంది. సభ్య దేశాల భిన్నమైన అభిప్రాయల వల్ల ఏకాభిప్రాయం కుదరడం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.


ఫిబ్రవరి 28న ఇరాన్ పై అమెరికా,ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో బ్రిక్స్ సభ్య దేశాలు తీవ్ర చర్యగా పరిగణించాయి. ఇరాన్, యూఏఈ రెండూ బ్రిక్స్‌లో సభ్యదేశాలు కావడంతో సమస్య మరింత జటిలమైంది. ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. ఈ సమయంలో కూటమిని ఏకతాటిపైకి తీసుకురావడానికి భారత్ తీవ్రంగా శ్రమిస్తోంది.

Leave a Reply