పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీడీవో

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; పదవ తరగతి పరీక్షలు శనివారం ప్రారంభం అయ్యాయి. కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత. రాజ శ్రీనివాస్ సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన వసతులను పరిశీలించారు.పరీక్షా కేంద్రంలో ప్రశాంతంగా పరీక్షల నిర్వహణ కోసం సిబ్బంది సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ కె. గంగాధర్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
