మాంగ్ దళితుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా మంత్రికి వినతి

మాంగ్ దళితుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా మంత్రికి వినతి

మంత్రికి లహుజీ సాల్వ్ పుస్తకం బహుకరణ

ఉట్నూర్, ఆంధ్రప్రభ: అదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ను అదిలాబాదులో మాంగ్ సమాజ్ అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గాడేకర్ పరశురామ్ మాంగ్ మర్యాదపూర్వకంగా కలిసి, ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు, గురువులకే గురువు అయిన ‘లహుజీ సాళ్వె’ జీవిత చరిత్రను తెలుగులో మొట్ట మొదటిసారిగా ప్రభుత్వం ద్వారా ‘క్రాంతిపిత గురువర్య లహుజీ సాళ్వె ‘ పేరుతో పుస్తకం ప్రచురించినందుకు మాంగ్ సమాజ్ అదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున మంత్రి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పర్యాటకం సాంస్కృతిక శాఖా మంత్రి ప్రత్యేక ప్రోత్సాహం వలన మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ఆ తర్వాత మాంగ్ సమాజ్ ప్రజలు భోసారా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం చేయాలని వినతిపత్రంను మంత్రి అందించగా, వారు సానుకూలంగా స్పందించారని జిల్లా అధ్యక్షులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో జిల్లా అధ్యక్షుల వెంట
గొట్ముక్లే సుభాష్ మాంగ్ (సర్పంచ్, భోసారా), గొట్ముక్లే ప్రభాస్ మాంగ్, దీపక్ పాల్గొన్నారని అయన తెలిపారు.