హామీ పనులు పరిశీలించిన జాయింట్ కమిషనర్

బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ మండలం ఉట్ పల్లి గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనులను సోమవారం పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ శేషు కుమార్ తనిఖీ చేశారు.గ్రామం లోని చె రువులో చేపట్టిన పనులను కూలీలను అడిగి తెలుసుకున్నారు. పూడిక తీత పనుల పై సిబ్బందికి పలు సూచనలు చేశారు. కూలీల హాజరు వివరాలను మస్టర్ రోల్స్ పరిశీలించారు.అయన వెంట జిల్లా అధికారి ఓం పాల్ ఇంచార్జ్ ఎంపిడిఓ వేణు, ఏపీ ఓ మనోహర్, గ్రామ కార్యదర్శి ప్రేమ్ రాజ్, ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు.
