ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపివేయాలి…

ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపివేయాలి…
భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి…
కరీమాబాద్, ఆంధ్రప్రభ : గత 11 రోజులుగా నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఇరాన్ దేశంపై అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని భారత అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఎస్ కె ఎం జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం అమెరికా ఇజ్రాయిల్ దిష్టిబొమ్మను రైతు సంఘాల నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్న హంతక దాడులను వెంటనే నిలిపివేయాలని ప్రపంచ శాంతి వర్ధిల్లాలని నినాదాలు చేశారు.
ఎస్ కే యం జిల్లా కన్వీనర్లు రాచర్ల బాలరాజు ఇసంపల్లి బాబు సోమిడి శ్రీనివాస్ లు మాట్లాడుతూ అమెరికా ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ పై దాడి చేసి మొత్తం ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశాయని వారు విమర్శించారు. నిరాధారమైన ఆరోపణలతో ఇరాన్ అధిపతి అయితుల్ల ఖమేనితో పాటు నేటికీ 1000కి పైగా ప్రజలను ఈ దేశాలు చంపివేశాయని వారు అన్నారు. పాఠశాలలు ఆసుపత్రులపై బాంబుల దాడి చేశారని వారు గుర్తు చేశారు. అమెరికా ట్రంప్ ప్రభుత్వం అభివృద్ధి చెందిన దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇలాంటి దారుణాలకు చేస్తున్నదని పెట్రో డాలర్ ఆధిపత్య ఆర్థిక నియంత్రణ కోసం కోసమే యుద్ధాలు చేస్తున్నదని వారు ఆరోపించారు.
ప్రపంచ శాంతికి శ్రామిక ప్రజలకు అమెరికాఅతి పెద్దశత్రువు అనివారన్నారు. కార్యక్రమంలో ఎస్కేయం కన్వీనర్ సుధమల్ల భాస్కర్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు జక్కుల తిరుపతి, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్, అక్క పెళ్లి సుధాకర్, మైదంపాని పెద్దింటి కొమ్మాలు, ఎండి అక్బర్, అప్పనాపురం నరసయ్య, పిడిఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి , మర్రి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
