ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టాలి

ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టాలి

మర్రిగూడ, ఆంధ్రప్రభ : గ్రామములో ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టాలని సర్పంచ్ లపoగి నరసింహఅన్నారు. సోమవారం తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి గ్రామంలో స్థానిక అంగన్వాడి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ లపoగి నరసింహ హాజరై మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ప్లాస్టిక్ వాడకo వల్ల కలిగే అనర్థాల గురించి గ్రామ ప్రజలకు తెలియజేసి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడంలో గ్రామ ప్రజలు సహకరించాలని వారిని కోరారు.

అదేవిధంగా గ్రామంలోని కిరాణా దుకాణాలను సందర్శించి నిర్వాహకులకు ప్లాస్టిక్ కవర్స్ ను ఇతరులకు అమ్మిన, గ్రామ ప్రజలు వాడిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రూ.500 నుండి రూ.5000 వరకు జరిమానా విధించడం జరుగుతుందని తెలియజేస్తు నోటీసులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నజీరా, అంగన్వాడి టీచర్ శారద, ఆశా వర్కర్ సబిత, మండల కాంగ్రెస్ నాయకులు వడ్డే రమేష్, లపంగి అనంతం, బుర్కల జంగయ్య, కంకటి జంగమ్మ, పొగాకు నాగమణి, సివర్ల లక్ష్మమ్మ, పలువురు పాల్గొన్నారు.

Leave a Reply