రేణుక ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవంలో పాల్గొన్న బీజేపీ నేత
చిట్యాల, ఆంధ్రప్రభ ; రేణుక ఎల్లమ్మ తల్లి, చల్లని చూపు, దీవెనలు, ఎల్లవేళలా, అందరిపై ఉండాలని,బిజెపి రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి -సత్యపాల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గౌడ సంఘం అధ్యక్షుడు బుర్ర లక్ష్మణ్ గౌడ్, ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ తల్లి 5వవార్షికోత్సవం ,నిర్వహిస్తున్నారు. మంగళవారం కీర్తి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ గౌడ కులస్తులు వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, తల్లి ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని, గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ తల్లి ,కృపతోనే వారి కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, మనస్ఫూర్తిగా వేడుకుంటునన్నారు.
అనంతరం గౌడ సంఘం కమిటీ ఆధ్వర్యంలో కీర్తి రెడ్డి ని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో గౌడ సంఘం ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల రాజు, బుర్ర రాజకుమార్ గుర్రపు రాజు బుర్ర నరేష్ ఆముదాలపెళ్లి శ్రీనివాస్ , బిజెపి మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్,మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్, చింతల రాజేందర్, వల్లాల ప్రవీణ్, గుండ మణికుమార్, కేంసారపు ప్రభాకర్, పెరుమాండ్ల రాజు, బుర్ర రాహుల్ బుర్ర తిరుపతి , గౌడ కుటుంబాలు, తదితరులు పాల్గొన్నారు.
