జనసేన నేత కస్తూరి సురేష్‌కు ఘన నివాళులు

కోదాడ, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రానికి చెందిన జనసేన నియోజకవర్గ నాయకుడు కస్తూరి సురేష్ మృతి పార్టీకి, అలాగే మున్నూరు కాపు సామాజిక వర్గానికి తీరని లోటని జనసేన నాయకులు పేర్కొన్నారు.

మంగళవారం కోదాడలో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు రాయల సతీష్ నాయుడు, కస్తూరి సైదులు, రాములు, వీరాంజనేయులు, సత్యనారాయణ, గణేష్, వెంకటి, కందికొండ శ్రీనివాస్, సీతయ్య, నవీన్ నాయుడు, సన్నీరు మురళి, తుమ్మల శీను తదితరులు కస్తూరి సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, సురేష్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని నాయకులు హామీ ఇచ్చారు.