వన్ కె ర్యాలీ..

వన్ కె ర్యాలీ..
చిట్యాల, ఆంధ్రప్రభ : నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించాలంటే మార్నింగ్ వాకింగ్ తప్పనిసరి చేయాలని అని మున్సిపల్ చైర్మన్ పందిరి గీత ప్రజలకు పిలుపునిచ్చారు సోమవారం నాడు 99 రోజుల ప్రణాళిక లో భాగంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధి చిట్యాల మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో గల హై స్కూల్ దగ్గర వనిపాకల రోడ్డులో చైర్మన్ పందిరి గీత జెండా ఊపి వన్ కె రన్ ర్యాలీని ప్రారంభించారు అనంతరం చైర్మన్ పందిరి గీత మాట్లాడుతూ కంప్యూటర్ యుగంలో ప్రతి మనిషికి అనారోగ్యానికి గురి కావడం ముఖ్యంగా బీపీ షుగర్ థైరాయిడ్ వంటి వ్యాధుల నుండి రక్షించుకోవాలంటే మనం ఉదయం లేవగానే మార్నింగ్ వాకింగ్ చేసినట్లయితే పై వాటి నుండి తప్పించుకోగలుగుతామని చైర్మన్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ కౌన్సిలర్లు అంగన్వాడీలు పట్టణ ప్రజలు యువత తదితరు పాల్గొన్నారు.
