వందేమాతరం @150 వేడుకలు..

వందేమాతరం @150 వేడుకలు..

నల్గొండ,ఆంధ్ర ప్రభ: నల్లగొండ పట్టణంలోని 12వ బెటాలియన్ అన్నేపర్తి నందు కమాండెంట్ కె వీరయ్య ఆధ్వర్యంలో శుక్రవారం అసిస్టెంట్ కమాండేంట్ నర్సింగ్ వెంకన్న వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారతదేశానికి బంకిమ్‌చంద్ర ఛట్టోపాధ్యాయ్‌ రచించిన వందేమాతరం భారతీయులు ఐక్యంగా ఉండేందుకు, దేశ స్ఫూర్తి అందరిలో కలిగించేందుకు ఈ పాట ప్రేరణనిచ్చిందని.. దేశభక్తి అనేది మాటలకు అతీతమైన భావోద్వేగం అయితే.. స్పష్టమైన స్వరరూపాన్ని ఇచ్చే పాట వందేమాతరం అన్నారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో స్వాతంత్ర్య సమరయోధుల ర్యాలీ నినాదంగా, మాతృభూమి పట్ల ప్రేమ, భక్తికి చిహ్నంగా మరియు విదేశీ శక్తికి వ్యతిరేకంగా ప్రతిఘటన నినాదంగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు, ఆర్ ఎస్ ఐలు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply