మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి

మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి

  • సీబీఎం ట్రస్ట్ చైర్‌పర్సన్ డాక్టర్ చిక్కుడు అనురాధ
  • అచ్చంపేటలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

అచ్చంపేట, ఆంధ్రప్రభ: అచ్చంపేట పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాభవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మహిళల సాధికారత, సమాన హక్కులు సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని అన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలిచి సమాజ పురోగతికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీబీఎం ట్రస్ట్ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ చిక్కుడు అనురాధ పాల్గొని మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు విద్య, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని ఆమె సూచించారు.

ఈ సందర్భంగా మహిళల సేవలను గుర్తిస్తూ పలువురిని సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అంతటి రజిత మల్లేష్, వైస్ చైర్మన్ శైలజ విష్ణువర్ధన్ రెడ్డి, మహిళా నాయకులు శారదమ్మ, మహిళా కౌన్సిలర్లు, స్థానిక మహిళలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply