జాబ్ కార్డుఉన్నప్రతి కుటుంబానికిపనికల్పిస్తాం

జాబ్ కార్డుఉన్నప్రతి కుటుంబానికిపనికల్పిస్తాం

  • రైతులు కూలీలు ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలి
  • పని ప్రదేశంలో కూలీలకు విధిగా వసతులు కల్పించాలి
  • నారాయణపేట డిఆర్ డిఓ మొగులప్ప

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పిస్తామనినారాయణపేటడిఆర్ డివో మొగులప్పఅన్నారు. ఉపాధి హామీ పథకం రైతులు కూలీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్లలో ఉపాధి హామీపనులుపరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవినిదృష్టిలో ఉంచుకొని పని ప్రదేశంలో కూలీలకు చలువ పందిళ్ళు త్రాగునీరు ఓ ఆర్ ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.

ప్రభుత్వం కూలీల వలసలు నివారించేందుకు ఉపాధి హామీపథకంచేపట్టినదని కూలీలు ఎండలు దృష్టిలో ఉంచుకొని ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు పనులు చేసుకోవాలన్నారు. చెరువుల్లో ఒండ్రు మట్టి తరలించేందుకు పదిమంది కూలీలు ఐదు ట్రిప్పుల మట్టి కొలతల ప్రకారం పని చేస్తేరూ. 307 గిట్టుబాటు చెల్లిస్తామన్నారు. రైతులు తమ వ్యవసాయ పొలాలు సారవంతం చేసుకునేందుకు ఒండ్రుమట్టి తరలించాలన్నారు.

అధికారులు ఉపాధిహామీపనులువేగవంతం చేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న చెరువుల పూడిక తీత ఒండ్రుమట్టి, పాటు కాలువ, చెరువుల పూడిక తీతపనులుచేపట్టాలన్నారు. వేసవి కాలం కూలీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కిషోర్ కుమార్, సర్పంచ్ బోయిన్ పల్లి కాశమ్మ,ఏపీవో లక్ష్మీరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ మనీషా, పంచాయతీ కార్యదర్శిరాఖీ,ఫీల్డ్ అసిస్టెంట్ బాలస్వామితదితరులు పాల్గొన్నారు.

Leave a Reply