పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అభినందనీయం….

పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అభినందనీయం….

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రైవేటు వైద్యులు పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని సింగిల్ విండో అధ్యక్షులు ఎం. బాల్ రెడ్డి, ఊట్కూర్ సర్పంచ్ ఎం. రేణుక భరత్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి. యగ్నేశ్వర్ రెడ్డి,మాజీ సర్పంచ్ లు సూర్య ప్రకాశ్ రెడ్డి, భాస్కర్ అన్నారు. ఆదివారం నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల కేంద్రంలో ఐశ్వర్య క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందజేయాలనిఅన్నారు. ఐశ్వర్య క్లినిక్ డాక్టర్ భరత్ రెడ్డి చిన్న వయస్సులో ప్రైవేటు డాక్టర్ వృత్తి చేపట్టి అనతి కాలంలోనే రోగులకు మంచి వైద్యం అందజేస్తూ జిల్లాలో మంచి పేరు సంపాదించారని అన్నారు. ఉచిత వైద్య శిబిరంలో గుండె పరీక్షలు, బీపీ షుగర్ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. పేద ప్రజలు వివిధ రోగాలతో బాధపడుతున్నారని ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేపట్టి వారికి మందులు పంపిణీ చేస్తూ సేవా దృక్పథాన్ని పెంపొందిస్తున్నారనిఅన్నారు.

అనంతరం 200 మంది రోగులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. వైద్య శిబిరంలో వైద్య బృందం గందె కార్తీక్, ఎం భరత్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేష్, లైన్స్ క్లబ్ సభ్యులు సరిత హరి నారాయణ బట్టాడ్, ఎల్కోటి జనార్దన్ రెడ్డి, శ్రీధర్, సాయినాథ్ వార్డు సభ్యులు పల్లె అనిల్ రెడ్డి, అశోక్ గౌడ్, నాయకులు బాలాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply