పాఠశాలకు 20 డెస్క్ బెంచీల విరాళం..

పాఠశాలకు 20 డెస్క్ బెంచీల విరాళం..
గ్రామానికి చెందిన మాజీ ప్రిన్సిపల్ సత్యం గురువు మరో ఐదు బెంచీ లు విరాళంగా ఇస్తామని హామీ ఇచ్చారు..
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని మెండోరా లోని ప్రాథమిక పాఠశాల 1989-90 7వ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు శుక్రవారం మెండోరా ప్రాథమిక పాఠశాలలో 70 వేల రూపాయల విలువైన 20 డెస్క్ బెంచ్ లను విరాళంగా అందజేశారు.ప్రాథమిక పాఠశాలలో పిల్లలు డెస్క్ బెంచ్ లు లేక నేలపై కూర్చుంటున్నారని తెలిసి ఇదే పాఠశాలలోచదువుకున్న 1989-90 ఏడవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు 70 వేల రూపాయల విలువైన 20 డేస్కు బెంచీ లను ఈరోజు విరాళంగా అందజేశారు. పాఠశాలలో మరో 20 డేస్క్ బెంచీలు అవసరం ఉండగా ధాతలు ముందుకు రావాలని పాఠశాల హెడ్మాస్టర్ ముత్తేన్న విజ్ఞప్తి చేశారు.దయచేసి ఎవరైనా దాతలు ఒకటి కానీ రెండు గాని బెంచీలు కొనివ్వడానికి ముందుకు రావాలని పాఠశాల విద్యార్థుల విజ్ఞప్తి చేశారు.
ఒక్కొక్క డేస్క్ బెంచ్ విలువ రు.3500/-
పిల్లలు బెంచీలు లేక కింద కూర్చుంటున్నారు మేము శుక్రవారం రోజున మేము అందించిన బెంచులతో రెండు క్లాసులకు సౌకర్యంగా ఉంటుంది కానీ ఇంకో రెండు క్లాసులకు మరో 20 బెంచీలు అవసరం కావున దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్, పల్లె శేఖర్, 1989-90 బ్యాచ్ పూర్వ విద్యార్థులు కుంట రాజేశ్వర్, కుంట గంగారెడ్డి, మెడికల్ సత్యం, రామచందర్ గౌడ్, బాపూరావు, కిరాణం చిట్టీ, మురళీ, స్సపాల సత్యనారాయణ, లింగారెడ్డి , గంగసాయిలు,వార్డు సభ్యులు గ్రామ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
