మన ఊరు – మన భద్రత పై పోలీసుల అవగాహన

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలం హస కొత్తూరు గ్రామంలోని మారుతి నగర్,కమ్మర్ పల్లి లో పోలీసు కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు..కమ్మర్ పల్లి ఎస్ఐ జి. అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు “మన ఊరు – మన భద్రత – మన బాధ్యత” కార్యక్రమంలో గురువారం ప్రజలకు అవగాహన కల్పించారు.గ్రామస్తుల భద్రత,నేరాల నియంత్రణ మరియు సామాజిక బాధ్యతపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు.
ఈ సందర్భంగా కమ్మర్ పల్లి పోలీసులు గ్రామస్తులతో మాట్లాడుతూ పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.ట్రాఫిక్ నియమాలు.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని,హెల్మెట్ ధరించాలని సూచించారు.మత్తు పదార్థాలకు దూరం.. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా జాగ్రత్త వహించాలని,గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
సైబర్ నేరాలు.. మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటిపి లు చెప్పకూడదని హెచ్చరించారు.సిసి కెమెరాల ఏర్పాటు.. గ్రామంలో భద్రతను పటిష్టం చేయడానికి ప్రతి వీధిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని,దీనివల్ల నేరాలను అరికట్టవచ్చని గ్రామస్తులకు వివరించారు.ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలను కాపాడటం సాధ్యమవుతుందని పోలీసులు ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,మహిళలు మరియు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
