బాలుడికి తలసేమియా.. దీన స్థితిలో తల్లిదండ్రులు

బాలుడికి తలసేమియా.. దీన స్థితిలో తల్లిదండ్రులు
- ఎన్టీఆర్ జిల్లా కొండపర్వలో తలసేమియాతో బాధపడుతున్న శశాంక్
- వ్యాధి నివారణ కోసం రూ.25 లక్షలు ఖర్చు అవుతుందన్న డాక్టర్స్
- దాతల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు
విస్సన్నపేట,ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో దిబ్బల కాలనీకి చెందిన వంగూరి నాగార్జున, ఎస్తేరు అనే దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడైన శశాంక్ కు చిన్న వయసు నుండి తల సేమియా వ్యాధి ఉండటం వల్ల కూలీ పనులు చేసుకుంటూ తన కుమారుడు మెరుగైన వైద్యం కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టిన ప్రయోజనం లేక పోవడంతో శశాంక్ తల్లిదండ్రులు వాపోతున్నారు.
మందులతో వ్యాధి తగ్గదని వైద్యులు చెప్పడం జరిగిందన్నారు. తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలని 25 లక్షలు రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో ఏమి చేయాలో తెలియక బాధితులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
తల సేమియా వ్యాధి నిర్మూలన ఆపరేషన్ కోసం దాతలు ముందుకు వచ్చి తమ వంతుగా సహాయం చేసి మా పెద్ద కుమారుడు శశాంక్ ప్రాణాలను కాపాడాలని తల్లిదండ్రులు రెండు చేతులేత్తి ప్రజానీకానికి దండం పెడుతూ సహాయం కోరారు. వారి ఫోన్ పే నంబర్ 9346666376 కు ఫోన్ చేసి సహాయం చేయగలరని కోరుతున్నారు.
