వేణుగోపాలస్వామికి వెన్నపూస అలంకరణ

వేణుగోపాలస్వామికి వెన్నపూస అలంకరణ

గంపలగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మండలంలోని నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు తిరునఘరి గోపాలాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి సోమవారం నవనీతముతో(వెన్నపూస) అలంకరణ చేశారు.

వైశాఖ మాసంలో ఉష్ణతాపం నుండి స్వామివారికి ఉపశమనం కలిగించుటకు వెన్నపూసతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ఆలయ ఈఓ నేల సంధ్య,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Leave a Reply