కాలువలలో గుర్రపు డెక్క ఆకు తొలగింపు

కాలువలలో గుర్రపు డెక్క ఆకు తొలగింపు

  • నగరంలో డీసిల్టింగ్ పనులను విస్తృతంగా చేపడుతున్నాం
  • విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ,ఆంధ్ర ప్రభ: విజయవాడ నగరం లో దోమల నివారణ లో భాగంగా డీసిల్టింగ్ పనులను విస్తృతంగా చేపడుతున్నామని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. బుడమేరు కాలువ, రైవస్ కాలువ, ఏలూరు కాలువ, బందర్ కాలువలలో పేరుకు పోయిన గుర్రపు డెక్కలు, మట్టి కూడలు, చెత్తను బూట్ల సహాయం తో ట్రక్సర్ వాహనంతో తొలగిస్తున్నామని పేర్కొన్నారు.

అదే విధంగా నగరం లోని ప్రధాన మేజర్ ఔట్‌ఫాల్ డ్రైన్లలో జేసీబీలు, నాలామాన్ యంత్రాలు, ఎక్స్కవేటర్ వాహనాల సహాయంతో డీసిల్టింగ్ పనులను వేగవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కాలువల్లో నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకుంటున్నామని, కాలువల ప్రవాహం సజావుగా సాగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కమిషనర్ వివరించారు.నగర ప్రజలు చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించాలని, నగర పరిశుభ్రత పరిరక్షణలో భాగస్వాములు కావాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply