రూ.6.43 కోట్లతో గ్రామీణ వైద్య రంగ బలోపేతం…

రూ.6.43 కోట్లతో గ్రామీణ వైద్య రంగ బలోపేతం…

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
వెంకటాపురంలో గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే భూమిపూజ

మోపిదేవి, ఆంధ్ర‌ప్ర‌భ : నియోజకవర్గంలో గ్రామీణ వైద్య రంగాన్ని రూ.6.43 కోట్లతో బలోపేతం చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సోమవారం మోపిదేవి మండలం వెంకటాపురంలో కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.36లక్షలతో నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 15వ ఆర్థిక సంఘ నిధులు రూ.5.04 కోట్లతో 14 నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు రూ.1.39 కోట్లతో నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న15 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్ర స్థలదాత, మాజీ సర్పంచ్ రావి వెంకటేశ్వరరావు దంపతులను ఎమ్మెల్యే సత్కరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నడకుదుటి జనని కుమారి, టీడీపీ మండల అధ్యక్షులు నడకుదుటి జనార్ధనరావు, పంచాయతీ రాజ్ శాఖ డీఈ పగడాల సురేష్, ఏఈ బొప్పన శ్రీనివాసరావు, వైద్యాధికారి డాక్టర్ నంబూరి శ్రీరామ్ సాయి, హెల్త్ సూపర్ వైజర్ తోట సుధాకర్, ఎంపీహెచ్ఈఓ నందం బాబూరావు, హెల్త్ విజిటర్ విజయవల్లి, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ నాగలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ రాంబాబు, ఏఎన్ఎం శైలజ, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply