మహా కుంభాభిషేకానికి రండి… వీక్షించండి..

మహా కుంభాభిషేకానికి రండి… వీక్షించండి..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రి పై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మార్చి ఆరో తేదీ నుంచి ప్రారంభమయ్యే మహా కుంభాభిషేక మహోత్సవం-2026 కు విచ్చేయాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను ఆలయ చైర్మన్ బొర్రా రాధకృష్ణ (గాంధీ) , ఆలయ ఈవో శీనా నాయక్, కలిసి ఆహ్వానించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో సోమవారం ఎంపి కేశినేని శివనాథ్ కు ఆలయ చైర్మన్ బొర్రా రాధకృష్ణ (గాంధీ), ఆలయ ఈవో శీనా నాయక్, స్థానాచార్య శివప్రసాద్ శర్మ ఆహ్వానపత్రిక అందించారు.
మార్చి 6వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు మహా కుంభాభిషేక మహోత్సవం జరుగుతుందని వివరించారు. వేద పండితులు ఎంపి కేశినేని శివనాథ్ కి వేద ఆశీర్వచనం చేయటంతో పాటు అమ్మవారి తీర్ధ ప్రసాదాలు, శేష వస్త్రం అందజేశారు. ఆ తర్వాత కుంభాభిషేక మహోత్సవము-2026 ఏర్పాట్ల గురించి ఎంపి కేశినేని శివనాథ్ అడిగి తెలుసుకున్నారు. 12 ఏళ్లకు ఒకసారి దేవస్థానంలో జరిగే మహా కుంభాభిషేక మహోత్సవము ప్రతిష్టాత్మకంగా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ సూచించారు.

